My Friend

నేను
ఒంటరి జంట కళ్ళతో ఆకాశాన్ని చూస్తున్నాను..
ఎన్నో ఆలోచనలు,మరెన్నో కన్నీళ్ళ ఆనవాళ్ళు...

ఆలోచిస్తున్నాను,ఆకాశాన్ని చూస్తూనే వున్నాను .

అంతలో ,
ఒక చిన్ని బుడగ ఎగురుతూ కన్పించింది ..
ఇంత పెద్ద ఆకాశం లో ఆ బుడగ లోని గాలి ఏమాత్రంలే అనుకుని కిందికి చూసాను.

ఒక చిన్న పాప,
ఆమె చేతిలో ఎగరడానికి సిద్దం గా ఉన్న బోలెడన్ని బుడగలు ..
ఆమె ఆకాశాన్ని తన ఊపిరితో నింపడానికి ప్రయత్నిస్తుందేమో అనిపించింది..

కాసేపు ఆలోచించాను..,ఆకాశాన్ని చూస్తూ కాదు..ఊపిరి పోసుకున్న అ బుడగల్ని చూస్తూ.
నాకు అర్ధమయింది,అ బుడగ లోని బుజ్జి ఊపిరి మనదని.
అది ఆకాశం కన్నా ఎక్కువని.

మళ్లీ ఆలోచించడం మొదలు పెట్టాను .
అ చిన్న అమ్మాయి బుజ్జి కళ్ళలోకి చూస్తూ..

విశాలమయిన నీలపు ఆకాశం నాకు కనిపించింది.
నా ఊపిరితో ఎగురుతున్న ఎన్నో బుడగలు కన్పించాయి ..
ఆ చిన్న అమ్మాయి పేరు మధు మతి ..నా ఫ్రెండ్ .

Related Posts:

  • మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఫొటోస్ Read More
  • జీవితం చాలా చిన్నది ఇంత పెద్ద జీవితం కదరా చూద్దాం లే ... ఇది ఇంతకుముందు నేను వాడే మాట..ఎందుకో తెలిదు ఇపుడు ఈ మాటని మార్చి రాయాలనుంది..జీవితం చాలా చిన్నదయిపోయిందేమో అనిపిస్తుంది.. అసలు చిన్న,పెద్ద కాసేపు పక్కన పెడితే జీవితం తనదైన సైజు లో కనిపిస… Read More
  • చలం అడవిలో పాములూ పులులూ ఉన్నాయి - జాగ్రత్త అనటం న్యాయం. జాగ్రత్తపడిపో..ప్రాణాలమీద అంత తీపి లేకపోయినా వెళ్ళు అనటం న్యాయం.. కానీ నీ హృదయంలో దౌర్జన్యంలేకపోతే పులిని బ్రహ్మస్వరూపంగా చూసుకుంటూ వెళ్ళు.. నీకేం భయంలేదు.. అని ప్రతివారిన… Read More
  • My Friend నేను ఒంటరి జంట కళ్ళతో ఆకాశాన్ని చూస్తున్నాను..ఎన్నో ఆలోచనలు,మరెన్నో కన్నీళ్ళ ఆనవాళ్ళు...ఆలోచిస్తున్నాను,ఆకాశాన్ని చూస్తూనే వున్నాను .అంతలో ,ఒక చిన్ని బుడగ ఎగురుతూ కన్పించింది ..ఇంత పెద్ద ఆకాశం లో ఆ బుడగ లోని గాలి ఏ… Read More
  • చలం చలం  చనిపోలేదు. చినుకు చూస్తే కనిపిస్తాడు. చిగురు చూస్తే కనిపిస్తాడు. పొడుగు జడ,పసిపిల్ల నవ్వు,మల్లెపువ్వు,చెరువు రేవు, గడ్డిపోచ..దాని మీదున్న తెల్లారి మంచు చూసిన ప్రతిసారి కనిపిస్తాడు. మైదానం లో పరుగెట్టి,పడుకుని,దొర్ల… Read More