Feel Of Love,



ఆమె హృదయం కనుబొమలపై కుదురుగా కుర్చుని,
సిగ్గు ముగ్గులు గీస్తున్న చిలిపి నడుము కి వెచ్చని సంకేతాలు పంపుతుంది.

నుదురు లో కరిగిపోయిన ముద్దు అణువణువునా ఆమె ను గిలిగింతల నదిలా గిచ్చుతుంది.
గుండెల మీద పడ్డ కురులు అక్కడి చిలిపి ఊసులను వింటూ
రాత్రి రాయబారాల వేకువ వెలుగులకు ఊపిరి పోస్తునాయి.
కౌగిలి ఒడిలో ప్రకృతి కూడా ప్రేమ రంగులద్దుకుంది.

విచ్చుకున్న పెదాలు మౌనపు రహస్యాలను ,
మందహాస తేనే జల్లులుగా అతని వేడి ఊపిరికి సాయం చేస్తున్నాయి.


హృదయ స్పందనల
మాటలను వినలేని వస్త్ర జాతి, మేను పలకరింతలను ఆపలేక పోతున్నాయి.
కనిపించని తన్మయత్వపు నీడ ఒడిలో ఒద్దికగా కలిసి తడిసిన జంట చినుకులు వీరు.
వీరి మద్య ఊపిరాడని గాలి దూర తీరాలకు పారిపోయింది.
చందమామ ని తాకడానికి కౌగిలి అతి దగ్గర దారేమో అనిపిస్తుంది.


ఆమె,అతను ప్రేమ జతను
కౌగిలి కిరీటం రాజ్యమేలుతుంది.






Related Posts:

  • చలం ఎంత నలపనీ..చీల్చనీ.. అపదల మీద ఆపదలు దొర్లించనీ.. కష్టాలమీద  కష్టాలు కలిగించనీ, ఉండుండీ కొన్ని దివ్యానుభవాలని ఎప్పుడో ఒకప్పుడు ప్రసాదిస్తుంది కనకనే.. ఆ ఆశే..ఆ కలలే, ఆ విశ్వాసమే జీవితాన్ని దుర్బరం కానీయకుండా&n… Read More
  • చలం చలం  చనిపోలేదు. చినుకు చూస్తే కనిపిస్తాడు. చిగురు చూస్తే కనిపిస్తాడు. పొడుగు జడ,పసిపిల్ల నవ్వు,మల్లెపువ్వు,చెరువు రేవు, గడ్డిపోచ..దాని మీదున్న తెల్లారి మంచు చూసిన ప్రతిసారి కనిపిస్తాడు. మైదానం లో పరుగెట్టి,పడుకుని,దొర్ల… Read More
  • మల్లి                                                         మంచు కురిసేవేళలో వి… Read More
  • కవితలు ప్రేమలోనో,పెళ్ళిలోనో విఫలమైనవాళ్ళు తమ అసహనాన్ని మొత్తం స్త్రీ జాతికో,మగజాతికో ఆపాదించి కష్టపడి నేర్చుకున్న కఠిన పదజాలం వాడేసి,కవితలు రాసేసి అదేదో సమాజాన్ని ఉద్ధరించే పని  అనుకోవడం అవివేకం. వసంతం కోసం ఎదురుచూసే… Read More
  • చలం అడవిలో పాములూ పులులూ ఉన్నాయి - జాగ్రత్త అనటం న్యాయం. జాగ్రత్తపడిపో..ప్రాణాలమీద అంత తీపి లేకపోయినా వెళ్ళు అనటం న్యాయం.. కానీ నీ హృదయంలో దౌర్జన్యంలేకపోతే పులిని బ్రహ్మస్వరూపంగా చూసుకుంటూ వెళ్ళు.. నీకేం భయంలేదు.. అని ప్రతివారిన… Read More