Journey Of Love..


ఒక జీవిత ప్రయాణం,
కొలవడానికి అనువయిన మార్గం ప్రేమ కౌగిలులే,

ఈ కౌగిలి ప్రయాణం లో అతని ఊపిరి పాడే పాట వినే అదృష్టం,
ఈ సృష్టిలో ఒంపులు తిరిగిన మేఘాలకి కూడా కురవని బిందువే.

ఈ కౌగిలిలో వర్షం వస్తే ఏ గొడుగు వీళ్ళకు గుర్తుకురాదు..,
ఒకరికొకరు గొడుగు అవడం తప్ప.

ఆమె మకరందం లో దాగున్న గుప్త నిదిని కనుగొనడానికి,
అతనికి మెరుపు తోడున్న మిణుగురు వెలుగు చాలు.


మూసిన రెప్పలు ప్రేమ అంచులకు పువ్వుల దారి పరుస్తాయి.
అంచుల అడుగులు జీవిత శిలకి వెన్నెల పూలు పూయిస్తాయి.
ఆమె విల్లు సందించే స్పర్శ ల భాణం,
తుమ్మెద తలపుల తిమ్మెర వర్షం.
ఒక జీవిత ప్రయాణం,
కొలవడానికి అనువయిన మార్గం ప్రేమ కౌగిలులే,



Related Posts:

  • మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఫొటోస్ Read More
  • జీవితం చాలా చిన్నది ఇంత పెద్ద జీవితం కదరా చూద్దాం లే ... ఇది ఇంతకుముందు నేను వాడే మాట..ఎందుకో తెలిదు ఇపుడు ఈ మాటని మార్చి రాయాలనుంది..జీవితం చాలా చిన్నదయిపోయిందేమో అనిపిస్తుంది.. అసలు చిన్న,పెద్ద కాసేపు పక్కన పెడితే జీవితం తనదైన సైజు లో కనిపిస… Read More
  • Feel Of Love, ఆమె హృదయం కనుబొమలపై కుదురుగా కుర్చుని, సిగ్గు ముగ్గులు గీస్తున్న చిలిపి నడుము కి వెచ్చని సంకేతాలు పంపుతుంది. నుదురు లో కరిగిపోయిన ముద్దు అణువణువునా ఆమె ను గిలిగింతల నదిలా గిచ్చుతుంది. గుండెల మీద పడ్డ కురులు … Read More
  • My Friend నేను ఒంటరి జంట కళ్ళతో ఆకాశాన్ని చూస్తున్నాను..ఎన్నో ఆలోచనలు,మరెన్నో కన్నీళ్ళ ఆనవాళ్ళు...ఆలోచిస్తున్నాను,ఆకాశాన్ని చూస్తూనే వున్నాను .అంతలో ,ఒక చిన్ని బుడగ ఎగురుతూ కన్పించింది ..ఇంత పెద్ద ఆకాశం లో ఆ బుడగ లోని గాలి ఏ… Read More
  • Hug of Love ఏదో రాయాలని కూర్చున్నా...అలా చూస్తూనే కూర్చుండి పోయా..MAGIC అంటే మాయం చేయచేయడమే కాదు, కాసేపు మనల్ని మనం వెతుక్కోడం కుడా.. ఆ అమ్మాయి మొహం లో భావాలను లెక్కించడానికి google లో గణిత వేత్తల address లు వెతకకాలేమో. ప… Read More