ముత్యపు జల్లు






కొన్ని భావాలను మనం పలకలేము.
అలా అని ఆపనూలేము.
గతాన్ని గుండె ఎన్ని సార్లు తవ్వుకున్నా..
కళ్ళు తెరవడానికి నాకు భయం
చీకటి మాత్రమే నాకు మళ్లీ ప్రేమ వెలుగులను చూపించగలదు.

కలలు,జ్ఞాపకాలు,ఊసులు....ఆ ఊహలు
కళ్ళల్లోనే ఇంకా తిరుగుతున్నాయి.
జంట ను చూసినా,
నింగి అంచును చూసినా..
నా కళ్ళు మూయలేను.
తెరిచి ఉంచలేను...

జారే వజ్రపు కలలను,
ఆపలేను ....మోయలేను...
అసలు బతకలేను.
చావలేను..


కన్నీళ్ళ రుచి తెలిసిన వాడిని..,
కన్నీళ్ళ లోని కలలలో పాత కవితలు చూసి,
ఆశగా నవ్వుకునే పిచ్చివాడిని ..
నవ్వయినా,,,బాధయినా
కలతయినా,, కవితయినా..
నన్ను ముత్యపు జల్లులలో తడిపేవి కన్నీళ్ళే ..






note: కొన్ని జ్ఞాపకాలను ఒక్క కన్నీటి చుక్క తుడిచేయగలదు.
కొన్ని
జ్ఞాపకాల ముందు వేల చుక్కలు కూడా వెల లేనివే..