నేను
తననే చూస్తున్నా...
చీకటి గాలులకు ఆమె కురులు అలలయిపోయాయి.
ఆ తిమ్మెర నురగలలో ప్రకృతి నిదరోతుంది.
నేను
తననే చూస్తున్నా.
అవేవో అడుగుతున్నా.
అంతలో ఒక మేఘం తనని కాసేపు దాచేయడానికి ,
క్రూరం గా ఆమె వైపు వస్తుంది..
కంగారు పడ్డాను,
పక్కనున్న పూల మొక్కను గాలి ఇమ్మని అడిగాను...
క్రూర మేఘం కరిగి పారిపోయింది..
తను నావైపు చూసి,,
కొంటెగా కేక డార్లింగ్ అంది..
మురిసిపోయాను.
మునిగిపోయాను తన చల్లని చూపుల కౌగిలిలో.
కాసేపటికి
ఎందుకో
తను నవ్వుతుంది.
భయం తో చుట్టూ చూసాను..
క్రూరాతి క్రూర నల్లని మేఘం ఆమె వైపు వేగం గా వస్తుంది.
గాలి కోసం పక్కకి చూసా
పూల మొక్క వాడిపోయింది..
క్రూర మేఘం బిగ్గరగా నవ్వింది.
నా కళ్ళు వర్షానికి వేదికయ్యాయి.
తన మొహం లో మాత్రం ప్రశాంతత మాత్రమే వుంది..భయం లేదు.
ఏం చేయాలో తోచలేదు..
మేఘం తనకి దగ్గరయింది
చూడలేక కళ్ళు మూసుకున్నాను ..
రోజులు గడిచాయి
కళ్ళు మూసుకునే వున్నాను..